21, అక్టోబర్ 2010, గురువారం

సాధారణ జ్వరాలు - తీసుకోవలసిన జాగ్రత్తలు




"జరుగుబాటుంటే జ్వరమంత సుఖం లేద"న్నారు మన పెద్దవాళ్ళు....అప్పట్లో అంటే, సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో ఓసారి అలా వచ్చి పలకరించి ఇలా వెళ్ళిపోయేవి జ్వరాలు...రోజూ కాయకష్టం చేసే వాళ్ళకి, అలా రెండ్రోజులు మంచం మీద పడుకుని, వేళకింత తింటూ(రోజూలా అదరాబాదరాగా కాకుండా) ఉంటే ప్రాణానికి కాసింత సుఖంగానే అనిపించేదేమో! కాని మన రోజులకి అది అంత సరిపడదేమో! ఒక్కరోజు ఆఫీసుకి వెళ్ళకపోయినా జీతంలో కోత! productivity తగ్గిపోతుందిగా మరి! పైగా నెలకోసారి వచ్చే జ్వరాలతో ఎలా?.......మరి ఇలాంటి జ్వరాలకి జరుగుబాటు ఎలా ఉంటే, మనసుకి,శరీరానికి కాస్త హాయిగా ఉంటుందో తెలుసుకుందామా........

అసలు ఈ జ్వరం అంటే ఏంటి? ఎందుకు వస్తుందో ముందు టూకీగా తెలుసుకుందాం........మన శరీరం యొక్క ఉష్ణోగ్రత (core body temperature) మామూలుగా రోజువారీ ఉండేతేడాలకన్నా(diurnal variations అంటే మన శరీర ఉష్ణోగ్రత ఉదయం పూట,రాత్రి పూట వేరువేరుగా ఉంటుంది) పెరిగితే దాన్ని జ్వరం అనొచ్చు....... అంటే శరీర సాధారణ ఉష్ణోగ్రత 37'c or 98.4'F అనుకుంటే, ఒక డిగ్రీ ఎక్కువ వరకూ నార్మల్ గా తీసుకోవచ్చు.(100'F వరకూ).........ఈ జ్వరం అనేది ప్రత్యేకమైన వ్యాధి కాదు...అంతర్గతంగా ఉన్న ఒక వ్యాధి యొక్క బాహ్య లక్షణం(DISEASE SYMPTOM) మాత్రమే.కాబట్టి జ్వరానికి కారణాలు ఏదైనా కావచ్చు.మామూలు వైరల్ ఫీవర్స్ దగ్గరనుంచి విషజ్వరాలు,క్యాన్సర్లు కూడా కావచ్చు...ఒక్కొక వ్యాధికి జ్వరలక్షణం ఒక్కోరకంగా ఉంటుంది.....అంటే, fever periodicity,high or low grade, associated vth chills and rigors, other associated symptoms ఇలాంటివి అన్నమాట.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన వాళ్ళు సాధారణంగా ఒక అపోహ పడుతుంటారు..."జ్వరం బైటకి కనపడట్లేదు, ’లో జ్వరం’ ఉంది" అని....అలాంటిది ఏమీ ఉండదు..జ్వరం అంటే బయటికి కనిపించేది మాత్రమే....ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది "లోజ్వరం" ఉంది అని టాబ్లెట్లు మింగేస్తుంటారు..దాని వల్ల ఉపయోగం ఏమీ లేకపోగా, లివర్ దెబ్బతినే అవకాశం ఉంది......

ఇక ఫీవర్ ఎంత ఉందో, కరెక్ట్ గా ఎలా చూడాలో చూద్దాం......ఈ రోజుల్లో రకరకాల థర్మామీటర్స్ దొరుకుతున్నాయి....డిజిటల్, ఊరక చేత్తో పట్టుకుని చూసేవి ఇలా......కాని అన్నిటికన్నా బెస్ట్ ఒన్, మన పాత గ్లాస్ థర్మామీటర్(దీన్నే CLINICAL THERMOMETER అంటారు).......body temperature is best measured when it is done per rectally.కాని అలా చెయ్యటం ప్రాక్టికల్ గా కుదరదు కాబట్టి, నాలుక కింద పెట్టి చూడటం(ఒక నిమిషం పాటు) ఉత్తమం....(చేతికింద అంటే చంకలో పెట్టి చూసిన రీడింగుకి ఎప్పుడూ ఒక డిగ్రీ ఎక్కవ కలపాలి.)......చూసే ముందు,తర్వాత థర్మామీటర్ ని శుభ్రంగా తుడవాలి....మరీ చల్లటి నీళ్ళని కాని, మరీ వేడి నీళ్ళని కాని ఉపయోగించవద్దు...దీనివల్ల తప్పు రీడింగు రావటమే కాకుండా, థర్మామీటర్ పగిలిపోయే అవకాశం కూడా ఉంది....చూసేప్పుడు థర్మామీటర్ టిప్ ని పట్టుకోవద్దు..దీనివల్ల చూసినవాళ్ళ బాడీ టెంపరేచర్ ట్రాన్స్మిట్ అయ్యి రీడింగు తప్పు వచ్చే అవకాశం ఉంది.

ఇక మనం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చూద్దాం....
A) మొదటిది...మామూలు చిన్న చిన్న జ్వరాలకి డాక్టర్ దగ్గరికి పరిగెట్టనవసరం లేదు.....వెళ్ళి వాళ్ళు ఇచ్చే గుప్పెళ్ళ కొద్దీ మందులు మింగవలసిన అవసరం లేదు.దానివల్ల ఆ మెడిసిన్స్ వల్ల వచ్చే unnecessary side effects భరించటం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు.......మరి ఎలాంటి జ్వరాలకి వెళ్ళాలి? ఏది పెద్ద జ్వరమో, ఏది చిన్నదో ఎలా తెలుస్తుంది?.......
a)జ్వరం కాకుండా ఇంకేమన్నా ఇబ్బందులున్నాయో చూసుకోండి.ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి.ఎందుకంటే జ్వరం తీవ్రంగా ఉన్నపుడు మిగతా లక్షణాలు మాస్క్ అవుతాయి......విపరీతమైన దగ్గు, కళ్ళె....యూరిన్ తో చురుకు, మంట...విపరీతమైన చలి, వణుకు(మామూలుగా కొంత వరకు చలి,వణుకు ఉంటాయి,దాన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదు).... శరీరంలో ఎక్కడన్నా గడ్డల్లాంటివి,బిళ్ళలు కట్టటం......ఆగని వాంతులు,తట్టుకోలేని తలనొప్పి,చూపు మసక బారడం,మెడ బిగుసుకు పోవడం(ఇవి మెదడువాపు (meningitis)లక్షణాలు)....విపరీతమైన కీళ్ళనొప్పులు(జ్వరంతో పాటు మామూలుగా వళ్ళు నొప్పులు ఉంటాయి.అది సాధారణం).....పిల్లల్లో మరీ poor activity,feed అసలు తీసుకోకపోవడం...వంటి మీద పొక్కులు,rash రావటం.......కళ్ళు,యూరిన్ పచ్చగా రావటం.......ఇలా......
b) రోజు మొత్తం మీద ఒక్కసారి కూడా బాడీ నార్మల్ టెంపరేచర్ కి రాకపోవడం.... ఎంత పారాసిట్మాల్ వాడినా, తడిబట్ట పెట్టినా తగ్గకపోవడం...
c) బాడీ టెంపరేచర్ 106'F కన్నా ఎక్కువ ఉన్నప్పుడు..దీన్నే HYPER PYREXIA అంటారు...
d)వడదెబ్బ తగిలినప్పుడు,ఏదన్నా మందులు మింగినప్పుడు.....దీన్నే HYPER THERMIA అంటారు...ఇలా వచ్చిన జ్వరం మామూలు పారాసిట్మాల్ లాంటి మందులకి తగ్గదు...
ఇలాంటి జ్వరాలకి డాక్టర్ దగ్గరకి వెళ్ళాల్సిందే..................

B)నిన్న మా ఫ్రెండు ఒకళ్ళు హడావుడిగా ఫోను..."కౌటిల్యా! మా అక్క వాళ్ళ బాబు కి 105 fever..ఊళ్ళో డాక్టర్లు ఎవరూ లేరు.ఏం చెయ్యాలి?" అని....ఇలాంటి పరిస్థితి దాదాపు అందరికీ ఎప్పుడోకప్పుడు ఎదురవుతుంది...సడన్ గా అర్థరాత్రి జ్వరం ఎక్కువైపోతుంది..ఏం చెయ్యాలో కాలూ, చెయ్యి ఆడని పరిస్థితి!!!
ఇలాంటప్పుడు మన చేతుల్లో ఉండే మహత్తరమైన remedy, COLD SPONGING(తడిబట్ట పెట్టటం)....THIS IS THE MOST EFFECTIVE KIND OF MEASURE.....ఊరికే నుదురు మీద తడిబట్ట వెయ్యటం కాదు,దాని వల్ల ఏమీ ఉపయోగం ఉండదు....తలదగ్గరనుంచి, పాదాలవరకూ తడిబట్టతో ఆపకుండా continuousగా తుడుస్తూనే ఉండాలి....ఇలా తుడవటానికి ఏ నీళ్ళు వాడాలి? మామూలు room temperature దగ్గర ఉన్న నీళ్ళనే ఉపయోగించాలి...అంతేకాని, ice cubes or ice cold water వాడకూడదు,అలా వాడితే పేషెంట్ షాక్ లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది......మరీ చలిగా ఉంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళని కూడా ఉపయోగించవచ్చు....ఈ cold sponging, main aim అల్లా, బాడీ టెంపరేచర్ extremes కి raise అవ్వకుండా చూడడం...అప్పుడు ఎలాంటి అపాయమూ ఉండదు.....తుడిచేటప్పుడు పేషెంటు కాళ్ళకింద రెండు దిళ్ళు(పైన బొమ్మలోలా) ఎత్తు పెట్టాలి...ఇది తప్పని సరి.....cold sponging మామూలుగా అన్ని జ్వరాలకి చెయ్యాలి...

C) ఇక మామూలు జ్వరానికి వైద్యం.......పారాసిట్మాల్ 500mg(4yrs లోపు పిల్లలకైతే 250mg వెయ్యాలి syrup forms దొరుకుతాయి) మూడు పూటలా,అంటే 8 గంటల తేడాతో వేసుకోవాలి....ఏదన్నా తిన్న తర్వాత మాత్రమే వేసుకోవాలి....it is the most efficient and cost effective excellent drug to control fever...క్రోసిన్,మెటాసిన్,కాల్పాల్,సారిడాన్ ఇవన్నీ పారాసిట్మాల్ ట్రేడ్ నేమ్స్....ఏదైనా ఒకటే.....జ్వరం తగ్గింది కదా అని ఒక పూట వేసుకుని ఆపొద్దు...టాబ్లెట్ ఎఫెక్ట్ ఐపోగానే జ్వరం మళ్ళా వచ్చేస్తది..కాబట్టి కనీసం రెండు రోజుల వరకి 8hrs gap తొ తప్పని సరి......పారాసిట్మాల్ వల్ల వళ్ళునొప్పులు,మామూలుగా ఉండే తలనొప్పి తగ్గుతాయి....నొప్పులు మరీ ఎక్కువ ఉంటే, పారాసిట్మాల్ డోసు 650mg కి పెంచుకోవచ్చు...ఇది DOLO 650 అన్న trade name తో దొరుకుతుంది......పారాసిట్మాల్ వల్ల టెంపరేచర్ అసలు నార్మల్ కి రాకపోతే, ఒకరోజు తర్వాత better to consult a doctor and get the investigations done.....కొంతమంది జ్వరం వచ్చేట్టుంది అనగానే ఓ క్రోసిన్ వేసేసుకుంటారు..దీనివల్ల ఏమీ ఉపయోగం ఉండదు.జ్వరం రాకముందే పారాసిట్మాల్ వేసుకుంటే వచ్చే జ్వరం ఆగదు.....పారాసిట్మాల్ పెరిగిన టెంపరేచర్ ని మాత్రమే తగ్గిస్తుంది.....

D) ఇక జ్వరం వచ్చినప్పుడు అందరికీ కామన్ గా వచ్చే డౌటు.....ఏం తినాలి? అసలు తినాలా వద్దా? "లంఖణం దివ్యౌషధం" కదా,అందుకని పూర్తిగా మానేస్తే సరిపోద్దా!...ఇలా బోల్డు అనుమానాలు.......... any infection especially fever is a high metabolic state....అంటే మామూలుకన్నా జ్వరంగా ఉన్నపుడు శరీరానికి metabolic needs ఎక్కువగా ఉంటాయి..అంటే మామూలుకన్నా ఎక్కువగా తినాలన్న మాట! కాని పొట్ట భరించలేదే.....మన వాళ్ళు పెట్టే పథ్యానికి నోరు అస్సలు సహించదు కూడాను......కాబట్టి నోటికి ఆ సమయంలో తినాలనిపించినవి(తినాలనిపిస్తే ఆవకాయ,నెయ్యి వేసుకుని చక్కగా లాగించెయ్యండి.పొట్టలో మంటొస్తే తర్వాత చూసుకుందాం), తేలిగ్గా అరిగేవి(ఇడ్లీ is the best food..brea, bun ల్లో ఏమీ ఉండదు..more liquid diet is better) చూసుకుని, తక్కువ మోతాదుల్లో(మరీ ఎక్కువెక్కువ పట్టిస్తే తిప్పి బైటక్కొట్టే ప్రమాదముంది) ఎక్కువసార్లు లాగించెయ్యడమే! పాలు తాగే పిల్లలకి వీలైనన్ని ఎక్కువ సార్లు పాలు పట్టించాలి...

E) ఇక జ్వరం తగ్గక డాక్టర్ దగ్గరికి వెళితే EPIDEMIC గా ఉన్న జ్వరాలన్నిటికీ పరీక్షలు చేయించుకోండి......టైఫాయిడ్ మాత్రం 7th day of fever తర్వాత మాత్రమే DIAGNOSIS చెయ్యటం కుదరుతుంది....అలా కాకుండా ఏ డాక్టరన్నా మీకు ముందే టైఫాయిడ్ టెస్ట్ చేయిస్తే(చేయించి కొంచెం ఉందని చెప్పినా), ఒకటి ఆ డాక్టర్ కి తెలియదు, రెండు మిమ్మల్ని మోసం అన్నా చేస్తున్నట్టు....కాని test చేయించకుండా కొంతమంది emperical గా treatment పెడుతుంటారు....in such case u can wait till the test comes positive i.e. 7th day or u can proceed with the emperical treatment coz treatment is mostly same for typhoid and other bacterial fevers...

F) డాక్టర్ ఇచ్చిన కోర్సు ఏదైనా, అది మలేరియా కోర్సు అయినా, యాంటీ బయాటిక్ అయినా పూర్తిగా వాడండి....జ్వరం తగ్గింది కదా అని మధ్యలో మానెయ్యొద్దు...జ్వరం మళ్ళా తిరగబెట్టె అవకాశం ఉంది.....

G) ఈ మధ్య డెంగ్యూ లాంటి విషజ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి..వాటిని వీలైనంత త్వరగా గుర్తించి( high fever, joint and muscle pains with rash) సరైన వైద్యం చేయించుకోండి....(డెంగ్యూలో BLOOD PLATELET COUNT తగ్గుతుంది..కాబట్టి చిగుళ్ళనుంచి రక్తం రావటం,INTERNAL BLEEDINGS ఉంటాయి....కాబట్టి platelet replacement is essential...hence dont use normal pain killers like aspirin or voveran....only use paracetamol)

H) చాలా జ్వరాలకి కారణం దోమలు....prevention is better than cure..కాబట్టి దోమకాటు నివారణోపాయాలు పాటించండి....అన్ని mosquito repellents కన్నా best one is mosquito nets..(దోమ తెరలు)....

I) ఇక ఈ మధ్యకాలంలో కొన్ని జ్వరాలు నెలల తరబడి తగ్గట్లేదు....వీటినే FEVER OF UNKNOWN ORIGIN(FUO) or PYREXIA OF UNKNOWN ORIGIN(PUO) అంటారు...వీటిని డయాగ్నసిస్ చెయ్యటం చాలా కష్టం...కాబట్టి ఓపిగ్గా మీ డాక్టర్ కి investigations and diagnosis లో సహకరించండి......

J) ఇక మెడికల్ షాపు వాళ్ళు ఇచ్చినవో, లేకపోతే ముందు మీకు తెలిసినవో యాంటిబయాటిక్స్ అనవసరంగా వాడవద్దు...యాంటిబయాటిక్స్ life saving drugs..వాటిని ఆ purpose కి ఉండనివ్వండి....moreover antibiotics has no role at all in viral fevers...కాబట్టి వాడటం వృథా.....

K) చిన్నపిల్లలకి యాంటీబయాటిక్ సాధ్యమైనంతవరకి వాడొద్దు......రోజుల పిల్లలుంటారు..వాళ్ళకి తరచుగా వళ్ళు వెచ్చబడుతుంటుంది...ఖంగారు పడి పారాసిట్మాల్ సిరప్ లు పోసెయ్యొద్దు....మరిన్ని సార్లు తల్లిపాలు పట్టించండి...అదే సర్దుకుంటుంది.....

హ్మ్.....జ్వరం గురించి పూర్తి వివరాలు అందించాననుకోను.....మీకు మరేమన్నా అనుమానాలుంటే అడిగెయ్యండి.....you are most welcome.....

మీకు ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యలుంటే నాకు మెయిల్ చెయ్యవల్సిన నా చిరునామా: choudary.koutilya90@gmail.com

14 కామెంట్‌లు:

  1. వ్యాసం చాలా బాగుంది. paracetamol అంటే ఏమిటో తెలియక గూగుల్ లోకి వెళ్లాను. అది చెప్పినది అమెరికా వాళ్ళ కోసం ఇస్తున్నాను.
    Paracetamol, known as acetaminophen in the United States, is a painkiller that is popular throughout the world because it is remarkably safe.

    రిప్లయితొలగించండి
  2. మంచి విషయాలను తెలియచేశారు కౌటిల్య గారు నెనర్లు. ముఖ్యంగా లోపల జ్వరం గురించిన అపోహ బాగా తొలగించారు అలా మాత్రలను మింగే వాళ్ళను చాలా మందిని చూశాను.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుందండీ. మంచి విషయాలు చెప్పారు.

    రిప్లయితొలగించండి
  4. డాక్టర్ గారూ చాలా బాగా విశదీకరించారు. చాలా సంవత్సరాల క్రితం` Fever is your friend` అని రీడర్స్‌డైజెస్ట్ లో పడిన ఆర్టికల్ చదివాను . 101 లేక 102 డిగ్రీల జ్వరం రాగానే పారాసెటిమాల్ తీసుకోవాల్సిన అవసరం లేదని దాన్లో చదివాను.24 గంటలు ఆగి అప్పటికీ తగ్గకపోతే వాడాలి అని దాని సారాంశం .(పెద్ద వాళ్ళ విషయం లోనే లెండి) . కరెక్టేనా?

    రిప్లయితొలగించండి
  5. చాలా ఉపయోగకరమైన వ్యాసం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @ రావు గారు,
    ధన్యవాదాలు..నేను రాయని విషయాన్ని చెప్పినందుకు...acetamenophen is the correct chemical name for paracetamol..

    @budugoy గారు, శిశిర గారు, నాగమురళి గారు,
    ధన్యవాదాలు..మీరు ఇక్కడ కొత్తగా తెలుసుకున్నవి ఏవన్నా ఉంటే, మీరు కరెక్ట్ గా implement చెయ్యండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి...then my blog will meet its real purpose...ః)))

    @వేణూశ్రీకాంత్ గారు,
    మరి ఇకనుంచి అలా వేసుకునే వాళ్ళకి వద్దని చెప్తారుగా
    తప్పకుండా...ః)))

    రిప్లయితొలగించండి
  7. @తారకం గారు,
    మీరు చదివిన విషయం కొంత వరకు కరెక్టే..జ్వరం రాగానే వేసుకోనవసరం లేదు..అలా అని మరీ 24hrs wait చెయ్యాల్సిన అవసరం లేదు..ఎందుకంటే వేసుకుంటే PATIENT WILL FEEL MUCH COMFORTABLE...వేసుకున్నందువల్ల నష్టం ఏమీ ఉండదు...పైగా ఈ రోజుల్లో జ్వరాలు అంతసేపు 101 దగ్గరే నిలబడట్లేదు...

    రిప్లయితొలగించండి
  8. బాగా చెప్పారు.. పెరాసిటమాల్.. 500 మి.గ్రా వాడాలి అదీ 8 గం. తేడాతో అన్నారు అంటే. రోజుకు 1500 మి.గ్రా మించి వేసుకోకూడదంటారా? వేసుకుంటే లివర్ కి ప్రాబ్లమ్ అని తెలుసు.. కానీ జ్వరం అసలు కంట్రోల్ కాకపోతే.. రోజుమొత్తంలో ఎంతవరకూ లిమట్లో వాడొచ్చో కాస్త వివరించండి.

    చాలా పాయింట్లు కవర్ చేసారు. మంచి సమాచారం అందించి అపోహలను తొలగించినందుకు ధన్యవాదములు... ఇలానే రాస్తుంటారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  9. శ్రీనివాసరాజు గారూ,
    ముందు మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు....

    చాలా మంచి డౌటు అడిగారు...500mg 3 times a day అన్నది నార్మల్ డోసేజ్......4gm or 4000mg in case of adults and 90mg/kg in case children is the maximum permissible dose....అంటే రోజుకి 4000mg వరకూ వేసుకోవచ్చు...అంటే 500mg tablets, 8 వరకూ వేసుకోవచ్చు...

    కాని అంత ఎక్కువ డోసేజ్ డాక్టర్ మానిటరింగ్ లేకుండా వేసుకోవడం అంత మంచిది కాదు...

    కాబట్టి,మొదటి 500mg tablet కి జ్వరం అస్సలు కంట్రోల్ కాకపోతే,2hrs తర్వాత ఇంకోటి వెయ్యండి...దానికీ అస్సలు కంట్రోల్ కాకపోతే, ఇంకో 2hrs తర్వాత dolo 650 mg వెయ్యండి..అప్పుడు కనుక కంట్రోల్ అయితే 650mg tabs ఆ రోజుకి ఇంకో రెండు equal gap తో వెయ్యండి....650mg తో కూడా అస్సలు కంట్రోల్ అవ్వకపోతే, BETTER TO CONSULT A QUALIFIED DOCTOR....

    500mg తో కంట్రోల్ అయ్యి, మళ్ళా ఒక గంటకే తిరగబెడుతుంటే,4-5hrs gap తో ఒక TABLET వాడొచ్చు...అంటె 3000mg వరకూ very much safe...

    చిన్నపిల్లల్లో రోజుకి 90mg/kg max dose అయినా అంత ఎక్కువ డోసు కి వెళ్ళకుండా డాక్టర్ ని కలిస్తే మంచిది...

    రిప్లయితొలగించండి
  10. జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా వచ్చే అపోహలు తొలగించారు. చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇలా ఎంతో ఉపయోగకరమైన మరిన్ని టపాల కోసం ఎదురుచూస్తుంటాం.

    రిప్లయితొలగించండి
  11. నీ ఆలోచన బాగుంది కౌటిల్యా..
    ఆల్ ది బెస్ట్!

    రిప్లయితొలగించండి